అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక మృతి చెందిన ఘటన లోటస్‌ల్యాండు మార్కు సమీప ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక (16) క్షయ, బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏమీ తెలియని స్థితిలో ఇంట్లోంచి బయటకు వెళ్లి పోగా, పోలీసుల సాయంతో ఇంటికి తీసుకువచ్చారు. మళ్లీ ఈ నెల 22న మతిమరుపుతో హైదరాబాద్‌ వెళ్లి పోగా అక్కడ అఫ్జల్‌గంజ్‌ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స చేయించి, తిరిగి విజయవాడకు పంపారు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం తల్లి కూరగాయల కొనుగోలుకు బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఉరేసుకుంది. తల్లి వచ్చి చూడగా, ఉరికి వేలాడుతూ కనిపించింది. బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధితో, మానసిక పరిస్థితి బాగోలేదని కారణంతో మనస్తాపంతో కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తల్లి పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని