‘డబుల్‌ హార్స్‌’తో తెనాలికి మరింత ఖ్యాతి
eenadu telugu news
Published : 18/10/2021 04:38 IST

‘డబుల్‌ హార్స్‌’తో తెనాలికి మరింత ఖ్యాతి


రిమోట్‌తో నూతన ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శివకుమార్‌. పక్కన మునగాల మోహన్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఇతర అతిథులు

తెనాలి టౌన్‌, తెనాలి (గ్రామీణం), న్యూస్‌టుడే: ‘డబుల్‌ హార్స్‌’ మినపగుళ్లతో తెనాలికి మరింత ఖ్యాతి చేకూరిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ చెప్పారు. తెనాలి మండలం నందివెలుగులో సంస్థకు చెందిన ‘మహాదేవ డాల్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, వారి ద్వారా వేలాది మందికి ఉపాధి అందుతుందన్నారు. సంస్థ అధినేత మునగాల మోహన్‌శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ తమ ఉత్పత్తిని ఒకసారి కొనుగోలు చేసిన వారు మరోమారు అడిగేలా నాణ్యత ఉంటుందని, రానున్న రోజుల్లోనూ ఇదే తీరులో ముందుకు సాగుతామని చెప్పారు. ఏజెంట్లు, వ్యాపారులు, అతిథులకు జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఖాలెదా నసీమ్‌, వైస్‌ ఛైర్మన్‌ మాలేపాటి హరిప్రసాద్‌, సర్పంచ్‌ పవన్‌కుమార్‌, పారిశ్రామికవేత్త నూకల వెంకటవేణుగోపాల్‌, వైకుంఠపురం దేవస్థానం కమిటీ ఛైర్మన్‌ వుప్పల వరదరాజులు, డీఎస్పీ కె.స్రవంతిరాయ్‌, సినీ నటులు అన్నపూర్ణమ్మ, నవ్యస్వామి, సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె.నాయుడు, దర్శకుడు కిషోర్‌, యజుర్వేద్‌, వెంకటసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని