నేడు గురుకులాల ప్రారంభం
eenadu telugu news
Published : 18/10/2021 04:56 IST

నేడు గురుకులాల ప్రారంభం


వినుకొండ బాలయోగి గురుకులంలో గదులను శానిటైజ్‌ చేస్తున్న సిబ్బంది

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: దసరా సెలవుల అనంతరం జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలయోగి గురుకుల పాఠశాలలు సోమవారం తెరచుకోనున్నాయి. మొదటి రోజే విద్యార్థుల హాజరు శత శాతం ఉండేలా చూడాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆయా గురుకులాల ప్రిన్సిపల్స్‌.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులతో ఫోన్లు చేయించి విధిగా తీసుకురావాలని చెప్పించారు. ఈనెల పదో తేదీన విద్యార్థులను దసరా సెలవుల కోసం ఇళ్లకు పంపించారు. వారం రోజుల తర్వాత బాల, బాలికలు ఇళ్ల నుంచి గురుకులాలకు వస్తుండటంతో కరోనాని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినుకొండ బాలయోగి గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్‌ వెంకటమ్మ సిబ్బందితో శానిటైజేషన్‌ చేయించారు. జిల్లాలోని ఇతర గురుకులాల ప్రిన్సిపల్స్‌ కూడా ఇదే మాదిరిగా శానిటైజేషన్‌తో పాటు శుభ్రం చేయించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈనెల 18న విద్యార్థుల హాజరును నమోదు చేసి వివరాలు పంపాలని అధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేయడంలో నిమగ్నమయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని