నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు రేపు
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు రేపు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ఈ నెల 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు తదితరులు వస్తున్న సందర్భంగా ముఖ్య కూడళ్లలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు ఆయన చెప్పారు.
పాత పోలీస్‌ కంట్రోల్‌రూం నుంచి బెంజిసర్కిల్‌ వైపు వెళ్లే వాహనాలను ఆర్టీసీ వై కూడలి నుంచి కారల్‌మార్క్స్‌రోడ్డు మీదుగా స్వర్ణా ప్యాలెస్‌, దీప్తి సెంటరు, పుష్పా హోటల్‌ సెంటరు, జమ్మి చెట్టు సెంటరు, సిద్ధార్థ జంక్షన్‌ మీదుగా బెంజిసర్కిల్‌ వైపు మళ్లిస్తారు. లీ ఆర్టీసీ వై జంక్షన్‌ నుంచి బందరులాకులు, రాఘవయ్యపార్కు, కృష్ణలంక, స్క్యూబ్రిడ్జి మీదుగా బెంజిసర్కిల్‌ వైపు మళ్లిస్తారు. లీ బెంజిసర్కిల్‌ నుంచి మహాత్మాగాంధీ రోడ్డులోకి వచ్చే వాహనాలను బెంజిసర్కిల్‌ నుంచి ఫకీర్‌గూడెం, స్క్యూబ్రిడ్జి, కృష్ణలంక మీదుగా బస్‌స్టేషన్‌ వైపు మళ్లిస్తారు.లీ రెడ్‌సర్కిల్‌ నుంచి ఆర్టీఏ జంక్షన్‌, శిఖామణి సెంటరు నుంచి వెటర్నరీ జంక్షన్‌ వరకు ఏ విధమైన వాహనాలను అనుమతించరు.లీ బెంజిసర్కిల్‌ నుంచి డీసీపీ బంగ్లా కూడలి వరకు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తారు.

ఆర్టీసీ బస్సులు ఇలా.. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆర్టీసీ వై జంక్షన్‌ నుంచి బెంజిసర్కిల్‌ వైపునకు అనుమతించరు.
ఆర్టీసీ వై జంక్షన్‌ నుంచి మహాత్మాగాంధీరోడ్డు, 5 నెంబర్‌ రూట్‌లోకి వెళ్లే ఆర్టీసీ సిటీ బస్సులు కారల్‌మార్క్స్‌రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్‌ వరకు వెళ్లి అక్కడ నుంచి బెంజిసర్కిల్‌ వైపు వెళ్లాలి.

ఆహ్వానితులకు...
సాధారణ ఆహ్వానితులు వాటర్‌ట్యాంకు రోడ్డులోని గేటు నెంబరు 6 ద్వారా లోనికి ప్రవేశించి, వాలీబాల్‌ కోర్టులోని స్థలంలో వాహనాలు నిలపాలి.లీ ఐఏఎస్‌ అధికారులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు గేటు నెంబరు 2 నుంచి లోనికి ప్రవేశించి నిర్దేశించిన పార్కింగ్‌ ప్రదేశంలో వాహనాలు నిలపాల్సి ఉంటుందని సీపీ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని