ఉత్సాహంగా జిల్లా స్థాయి జూడో పోటీలు
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

ఉత్సాహంగా జిల్లా స్థాయి జూడో పోటీలు


ఎంపికైన జుడోకాలతో వెంకట్‌, గణేష్‌ సుబ్బారావు, రజని తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కండ్రికలోని కేఆర్‌, వీఆర్‌ అంతర్జాతీయ స్పోర్ట్స్‌ క్లబ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్‌ జూనియర్‌, కేడెట్‌ బాలబాలికల జూడో ఛాంపియన్‌షిప్‌లో పలువురు జుడోకాలు ఉత్సాహంగా తలపడ్డారు. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ప్లానింగ్‌ ఇన్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ కె.శివ శంకర్‌, జాతీయ జూడో సమాఖ్య ప్రధాన కార్యదర్శి అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కొవిడ్‌ విరామం తర్వాత జరుగుతున్న జిల్లా ఛాంపియన్‌షిప్‌లో 80 మంది క్రీడాకారులు పాల్గొనడం చాలా సంతోషించదగ్గ విషయమని కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా జూడో సంఘం అధ్యక్షుడు గణేష్‌ సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరచిన వారిని ఈ నెల 27 నుంచి అయిదు రోజుల పాటు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి అంతర్‌ జిల్లాల జూడో ఛాంపియన్‌షిప్‌లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. జిల్లా స్థాయి ఛాంపియన్‌షిప్‌లో తొలి మూడు స్థానాలు సాధించిన జుడోకాలను సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో పతకాలు, ప్రశంసా పత్రాలు అందించారు. జాతీయ జుడో సమాఖ్య ప్రధాన కార్యదర్శి నామిశెట్టి వెంకట్‌ ముఖ్యఅతిథిగా హాజరవగా.. జిల్లా జూడో సంఘం అధ్యక్షుడు గణేష్‌ సుబ్బారావు, వైస్‌ ఛైర్‌పర్సన్‌ జి.రజని, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ గమిడి శ్రీనివాస్‌, కోశాధికారి దుట్టా శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి నామిశెట్టి వపన్‌ సందీప్‌, కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎల్‌ ఉషారాణి పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన జిల్లా క్రీడాకారుల వివరాలను జిల్లా జూడో సంఘం ప్రధాన కార్యదర్శి నామిశెట్టి పవన్‌ సందీప్‌ ప్రకటించారు.

కేడెట్‌ బాలుర విభాగం: ఆర్‌.సుశాంత్‌, కె.గణేష్‌, పి.అరియాజ్‌, గగన్‌ సాయి, కె.బాలాజి, బాలికల విభాగంలో టి.హారిక, ఎ.సాయి నాగ సురేఖ, ఎం.రాజేశ్వరి, ఆర్‌.శిరీష.

సబ్‌ జూనియర్‌ బాలుర విభాగం: టి.దినేష్‌, బి.వర్మ, కె.లక్ష్మణ్‌, ఎం.దినేష్‌, ఎం.రామ్‌చంద్‌, జె.రంజిత్‌కుమార్‌, టి.కుమార్‌, కె.భార్గవ్‌, కె.కార్తీక్‌ సాయి, బాలికల విభాగంలో బీఎల్‌ శ్యామల దీపిక, జి.మౌనిక, జి.ప్రవల్లిక, కె.చరిత, బి.భావన.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని