ఉపాధ్యాయుడిఅరెస్టు.. సస్పెన్షన్‌
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

ఉపాధ్యాయుడిఅరెస్టు.. సస్పెన్షన్‌


హుస్సేన్‌

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : తరగతి గదిలో విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపిస్తూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల(ఉర్దూ) ఉపాధ్యాయుడు అత్తులూరి షేక్‌ హుస్సేన్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఆర్‌.విజయభాస్కరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాలికలతో అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు హుస్సేన్‌ను తమకు అప్పగించాలని ఆదివారం రాత్రి పట్టణ పోలీసు స్టేషన్‌ ఎదుట పట్టణంలోని 17, 18 వార్డులకు చెందిన విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో నివాసముంటూ పట్టణంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు హుస్సేన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. 24 గంటల్లోపే నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసులో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్నందుకుగాను తనతోపాటు గ్రామీణ సీఐ నరసింహారావు, ఎస్సైలు, సిబ్బందిని జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ అభినందించినట్లు డీఎస్పీ చెప్పారు.

సస్పెన్షన్‌.. విద్యార్థినుల్ని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వడ్డవల్లి మండల పరిషత్‌ ఉర్దూ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు షేక్‌ హుస్సేన్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ ఆర్‌ఎస్‌ గంగాభవాని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ ఎ.శ్రీనివాసరావు చెప్పారు. పాఠశాలను సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. బోధనకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని