గల్లీ టు లడక్‌
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

గల్లీ టు లడక్‌

ద్విచక్రవాహనంపై 55 రోజుల్లో 13,500 కిమీ సాహసయాత్ర


సియాచిన్‌ వారియర్‌ వద్ద వంశీ 

న్యూస్‌టుడే, చంద్రగిరి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.. చంద్రగిరికి చెందిన సక్కూరు వంశీ. ఇతడు స్వతహాగా బైక్‌ రైడర్‌. బీబీఏ పూర్తిచేసి చంద్రగిరి పంచాయతీ 14 వార్డు సభ్యుడిగా గెలుపొందాడు. తరచూ స్నేహితులతో కలిసి సుదూర ప్రాంతాలకు బైక్‌ రైడింగ్‌ చేస్తూ ఉండేవాడు. తన చిరకాల స్వప్నంగా ఉన్న దేశ.. విదేశాలు చుట్టిరావాలనే కోరికను హైదరాబాదులో ఉండే స్నేహితుడు యశ్వంత్‌తో పంచుకున్నాడు. ఈ ఏడాది జులై 28న చంద్రగిరి నుంచి ద్విచక్ర వాహనంపై హైదరాబాదు చేరుకుని అక్కడి నుంచి యశ్వంత్‌తో కలిసి చెరో బైక్‌పై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణా, దిల్లీ, పంజాబ్‌, ఛండీగఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, లడక్‌, చైనా, పాకిస్థాన్‌ బార్డర్‌ వరకు 55 రోజుల పాటు 13,500 కిలో మీటర్లు ప్రయాణించాడు. రోజుకి 300 నుంచి 400 కి.మీ వరకు ప్రయాణం చేశాడు. సుదీర్ఘ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఖర్చులు అయినట్లు వివరించాడు. సుదీర్ఘ యాత్ర తర్వాత ఆదివారం చంద్రగిరికి చేరుకున్న వంశీకి స్నేహితులు జీవన్‌, రాజశేఖర్‌, తనూజ్‌, సూరి, చంద్రమౌళి ఘనస్వాగతం పలికారు.

చంద్రగిరిలో వంశీకి స్వాగతం పలుకుతున్న స్నేహితులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని