కేంద్రం నిధులతోనే రాష్ట్రాభివృద్ధి: సోము
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

కేంద్రం నిధులతోనే రాష్ట్రాభివృద్ధి: సోము


పటవలలో మాట్లాడుతున్న సోము వీర్రాజు

 

తాళ్లరేవు: రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తాళ్లరేవు మండలం కొత్తకోరంగి దుర్గామల్లేశ్వర ఆశ్రమాన్ని గురువారం ఆయన సందర్శించారు. వృద్ధులు, బాలలకు దుప్పట్లు, పండ్లు పంచారు. పటవలలో భాజపా సీనియర్‌ నాయకులు దాట్ల మణిరాజు నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పుట్టిన రోజు వేడుకలు అక్టోబరు 7వ తేదీవరకు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రం 14, 15 ఆర్థిక సంఘాల నిధులిస్తోందని, మత్స్యకారుల సంక్షేమానికి, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే అభివృద్ధి, జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారానూ అత్యధిక నిధులు కేటాయించిందన్నారు. నేతలు సూర్యనారాయణరాజు, అయ్యాజీ వేమా, పవన్‌కుమార్‌, చిట్టిబాబు, దత్తాత్రేయవర్మ, అజయ్‌వర్మ, కరిమిలస్వామి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని