‘ఆర్యవైశ్యులకు ప్రభుత్వంలో గుర్తింపు’
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

‘ఆర్యవైశ్యులకు ప్రభుత్వంలో గుర్తింపు’


ఎంపీపీ దంపతులను సన్మానిస్తున్న జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యులు, పాల్గొన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే

గండేపల్లి, న్యూస్‌టుడే:  జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబుకు ఆదివారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి ముఖ్య అతిథిఫగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఏనాడు ఆర్యవైశ్యులకు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే..మూడు నెలల సమయంలోనే అదీ రథోత్సవానికి ముందే కొత్తది తయారు చేయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని అన్నారు. చంద్రబాబు, సోము వీర్రాజు, పవన్‌ కల్యాణ్‌.. ఎవరో ఒకరు హిందు మతానికి అన్యాయం జరుగుతోందంటూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతరం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును గజమాలతో సత్కరించారు. అనంతరం జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు, నాగరత్నం దంపతులను జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు, ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్‌ శివ రామసుబ్రహ్మణ్యం, ఏపీ వైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, జిల్లా నాయకులు కంచర్ల బాబి, అత్తులూరి సాయిబాబు, గండేపల్లి, కిర్లంపూడి ఎంపీపీలు చలగళ్ల దొరబాబు, తోట రవి, వైకాపా నాయకులు కందుల చిట్టిబాబు, పరిమి బాబు, బండారు రాజా, ఒమ్మి రఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని