ఈఎన్‌టీ వైద్యులకు బంగారు పతకాలు
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

ఈఎన్‌టీ వైద్యులకు బంగారు పతకాలు


వైద్యులను అభినందిస్తున్న జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మి

 

కాకినాడ(మసీదుసెంటర్‌): విశాఖలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఏఓఐసీఓఎన్‌ నిర్వహించిన సౌత్‌జోన్‌ సదస్సులో కాకినాడ ఆర్‌ఎంసీ ఈఎన్‌టీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వైవీఎన్‌ స్వర్ణ, ఈఎన్‌టీ మూడో ఏడాది పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ లక్ష్మీప్రత్యూష బంగారు పతకాలు సాధించారు. వారిని సోమవారం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.మహాలక్ష్మి, ఈఎన్‌టీ విభాగాధిపతి జీఎస్‌ఎన్‌ మూర్తి అభినందించారు. బ్లాక్‌ఫంగస్‌ సోకిన ఏడు నెలల గర్భిణికి నిర్వహించిన శస్త్రచికిత్స, అందించిన వైద్య సేవలు, కోలుకున్న విధానం, తల్లీబిడ్డలకు ప్రమాదం జరగకుండా తీసుకున్న జాగ్రత్తలు తదితర వాటిపై పేపర్‌ ప్రెజంటేషన్‌ ఇవ్వడంతో వీరు బంగారు పతకాలు సాధించారు.అనంతరం ఆర్‌ఎంసీ ప్రిన్సిపల్‌ డా.బాబ్జి వారిని అభినందించారు. ఈఎన్‌టీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రావుల భీమేశ్వర్‌, ఈఎన్‌టీ వైద్యనిపుణుడు డా. యు.సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని