మంటలు వ్యాపించియువకుడి మృతి
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

మంటలు వ్యాపించియువకుడి మృతి


క్రాంతికుమార్‌

రాజానగరం: ఓ వాహనానికి చెందిన పాత డీజిల్‌ ట్యాంకు నుంచి మంటలు వ్యాపించి లాలాచెరువు హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన సుంకర క్రాంతికుమార్‌(21) మృతి చెందాడు. ప్రత్యక్షసాక్షులు, స్థానికులు తెలిసిన సమాచారం మేరకు.. ఆటోనగర్‌లోని స్క్రేప్‌ దుకాణంలో పాత డీజిల్‌ ట్యాంకును గ్యాస్‌ కట్టర్‌తో కోసేందుకు క్రాంతికుమార్‌ ప్రయత్నిస్తుండగా దాని నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడికి సమీపంలోని బావి వద్దకు మంటలతోనే పరుగు పెట్టిన అతడు నేలకూలి మృతి చెందాడు. అక్కడే పనిచేస్తున్న మరో వ్యక్తి దుస్తులతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ ప్రయత్నంలో అతడి చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. మృతదేహం వద్ద తండ్రి గంగరాజు, తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. వారికి ఇద్దరు కుమారులు కాగా క్రాంతికుమార్‌ పెద్దవాడు. డిగ్రీ పూర్తి చేసిన ఆ యువకుడు తండ్రికి చేదోడుగా ఉండేందుకు వేరొక వ్యక్తితో కలిసి తండ్రి నిర్వహిస్తున్న దుకాణంలో పనిచేస్తున్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని