చౌక బియ్యం సీజ్‌
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

చౌక బియ్యం సీజ్‌

రావులపాలెం గ్రామీణం, గొల్లప్రోలు: పిడుగురాళ్ల నుంచి గొల్లప్రోలు మండలం బి.ప్రత్తిపాడులోని రవితేజ ట్రేడింగ్‌ కంపెనీకి రెండు లారీల్లో రూ.52.28లక్షల విలువైన 58.650 టన్నుల చౌక బియ్యాన్ని నకిలీ బిల్లులతో తరలిస్తుండగా గురువారం గోపాలపురం చెక్‌పోస్టు వద్ద విజిలెన్స్‌, రెవెన్యూ సిబ్బంది తనిఖీల్లో పట్టుకుని కేసునమోదు చేసినట్లు రావులపాలెం హెడ్‌కానిస్టేబుల్‌ వైకుంఠరావు తెలిపారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామ కొత్తపేట రామాలయం సమీపంలో గురువారం వ్యానులో అక్రమంగా 120 బస్తాల్లో రవాణా చేస్తున్న 5.9 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎన్‌.రామలింగేశ్వరరావు తెలిపారు. వాహనాన్ని సీజ్‌ చేసి, చేబ్రోలు గ్రామానికి చెందిన పి.మణికంఠ, దుర్గాడ గ్రామానికి చెందిన కె.శ్రీనివాసును అరెస్టు చేశామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని