విపత్తుల వేళ జాగ్రత్తలు తప్పనిసరి
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

విపత్తుల వేళ జాగ్రత్తలు తప్పనిసరి


మాట్లాడుతున్న జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి పి.కొండయ్య పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో మంగళవారం నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలుతో విపత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య మాట్లాడుతూ జిల్లాలో వారం రోజుల పాటు జాతీయ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌10 ఎన్‌టీం కమాండర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌ దీక్షిత్‌ మాట్లాడుతూ నవంబర్‌ 12వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల్లో మనల్ని మనం కాపాడుకునేందుకు అవలంబించాల్సిన విధానాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌10 ఎన్‌ టీం ఇన్‌స్పెక్టర్‌ కమల్‌సింగ్‌, ప్రకృతి వైపరిత్యాల నివారణ జిల్లా మేనేజ్‌మెంట్‌ డీపీఎం కె.లలిత, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని