close

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

తాజా వార్తలు

నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి!

లేఖ రాసి ఆత్మహత్యకు యత్నించిన బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌

జూబ్లీహిల్స్‌: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను చనిపోతున్నాను. నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి. మా నాన్నకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి’ అంటూ లేఖ రాసి ఓ బ్యాంకు మేనేజర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంకు చెందిన చిత్తలూరి శ్రవణ్‌కుమార్‌ (29) ఏడాది క్రితం సూర్యాపేటకు చెందిన హరితను వివాహం చేసుకున్నారు. శ్రవణ్‌కుమార్‌ జూబ్లీహిల్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వెంకటగిరిలోని తన ఇంట్లో శుక్రవారం రాత్రి ఆయన మద్యంలో విష ద్రావణం కలిపి తాగాడు. ఆ తర్వాత బాధ తట్టుకోలేక తలుపులను గట్టిగా కొట్టడంతో చుట్టుపక్కల వారు విని దొంగలనే అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. రాత్రి విధుల్లో ఉన్న ఎస్సై శేఖర్‌తో పాటు సిబ్బంది చేరుకున్నారు. అక్కడున్న విషద్రావణం సీసా మూత తీసి ఎస్సై వాసన చూశాడు. విషం తాగినట్లు గ్రహించి కక్కించేందుకు ప్రయత్నం చేశారు. మాదాపూర్‌లోని మాక్స్‌క్యూర్‌ ఆసుపత్రికి తరలించారు. వాసన చూడటంతో పాటు శ్రవణ్‌కుమార్‌ను కాపాడే ప్రయత్నంలో ఎస్సైపై సైతం కొద్ది సమయం పాటు విషం ప్రభావం కనిపించింది. శ్రవణ్‌కుమార్‌ గది నుంచి విషపు ద్రావణం సీసాను, అతను రాసిన కొన్ని లేఖలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో తన చావుకు ఎవరూ కారణం కాదని, తన తండ్రికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని, మరొకరు ఇవ్వాల్సిన డబ్బుతో తనకు కర్మకాండలు చేయాలని, 11వ రోజు చేయవద్దని రాశాడు. తన భార్య హరిత చాలా మంచిదన్నారు. తనను క్షమించాలని ఆమెను కోరాడు. ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలంటూ పేర్కొన్నాడు. తన తండ్రి తనకు హీరో అని, అమ్మా నిన్ను వదిలి వెళ్తున్నానంటూ రాశాడు. శ్రవణ్‌కుమార్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివశంకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.