Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీసుల అదుపులో రుణ యాప్‌ డైరెక్టర్‌!

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: రుణ యాప్‌ల కేసులో పేట్‌బషీరాబాద్‌ పోలీసులు పురోగతి సాధించారు. ఓ యాప్‌ డైరెక్టర్‌ను దిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన గుజ్జ చంద్రమోహన్‌(36) రుణ యాప్‌ల ఒత్తిడి వల్ల ఈ నెల 2న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు మృతుడు లావాదేవీలు నిర్వహించిన యాప్‌ల సమాచారం సేకరించారు.పాన్‌ బ్యాన్‌, క్యాష్‌ మ్యాప్‌, రెడ్‌ కార్ప్‌, రూపీ ఫ్లస్‌, కుష్‌ క్యాష్‌, ఫిక్స్‌ క్యాష్‌, రూపీ ఇన్‌స్టాంట్‌, మనీ మోర్‌, హోమ్‌ క్రెడిట్‌, క్యాష్‌ గో, క్యాష్‌ సీడ్‌ తదితర యాప్‌లపై ఐపీసీ 384, 420. 306, అండ్‌ సెక్షన్‌ 67, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌-2000 కింద కేసులు నమోదు చేశారు. పేట్‌బషీరాబాద్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ రమేశ్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) సీఐ రమణారెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలు నిందితుల కోసం వారం రోజుల కిందట దిల్లీ వెళ్లారు. ఆన్‌లైన్‌ కంపెనీల ద్వారా రుణ యాప్‌లు ఇస్తున్న ఓ యాప్‌ డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో నగరానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని