Published : 12/05/2021 03:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఛాతీ ఆసుపత్రిలో అదనంగా 40 పడకలు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: పెరుగుతున్న కొవిడ్‌ రోగుల రద్దీకి అనుగుణంగా ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో అదనంగా మరో 40 పడకలను సిద్ధం చేశారు. దవాఖానాలోని కొవిడ్‌ వార్డులో ఇప్పటికే 176 పడకలుండగా అన్నీ నిండిపోవడంతో.. మరో 40 ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. దీంతో కలిపి మొత్తం పడకల సంఖ్య 216కు చేరింది. వాటిలో 26 బెడ్లకు వెంటిలేటర్‌ సౌకర్యం ఉండగా, మిగతావి ఆక్సిజన్‌కు అనుసంధానించినవి. ప్రాణవాయువుకు కొరత లేదని, అదనంగా సమకూర్చిన పడకలకూ సమకూరేలా ఏర్పాట్లు చేశామని సూపరింటెండెంట్‌ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని