తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ!
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ!

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని ఖరీదైన ప్రాంతం. అక్కడ కొద్దిపాటి జాగా రూ.కోట్లు పలుకుతోంది. అటువంటి చోట ఖాళీస్థలాన్ని చూపుతూ ఓ మాయగాడు బరితెగించాడు. అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేట రెవెన్యూ మండల పరిధిలో సుమారు 9 ఎకరాల భూమి. ఆ స్థలం తనకు వారసత్వంగా వచ్చిందంటూ ఓ వ్యక్తి ప్రచారం చేసుకున్నాడు. తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు నమ్మించి రూ.10 కోట్ల మేర అడ్వాన్స్‌ తీసుకున్నాడు. కొనుగోలు చేసిన వ్యక్తులు ఆ భూమికి చెందిన రికార్డుల కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. రికార్డులు పరిశీలించగా..అప్పటి తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ చేసినట్లు అధికారులు నిర్ధారించుకున్నారు. దీనిపై అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని