ఎమ్మెల్యే రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌
eenadu telugu news
Published : 17/09/2021 00:34 IST

ఎమ్మెల్యే రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌


నిరసన వ్యక్తంచేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

కొడంగల్‌: కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌  నాయకులు ర్యాలీ నిర్వహించారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం నుంచి అంబేడ్కర్‌ కూడలి మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కొడంగల్‌ అభివృద్ధికి నిధులు రావాలంటే ఎమ్మెల్యే రాజీనామా చేసి సహకరించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.  కొడంగల్‌లో సైతం ఉప ఎన్నికలు వస్తే నిధులు వచ్చి.. కొంతైనా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు ఎండీ యూసుఫ్‌, ఎన్‌ ప్రశాంత్‌, రెడ్డి శ్రీనివాస్‌, ఏపూరి కృష్ణారెడ్డి, కృష్ణంరాజు, వెంకట్‌ రాములు గౌడ్‌, వి. విజయకుమార్‌ పాల్గొన్నారు.

నేడు దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ..

పరిగి: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో నేడు జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ సభకు జిల్లా నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలిరావాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి కోరారు. గురువారం తన నివాసంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సీఎం  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తీరును ఎండగట్టాలని అన్నారు. ఈనెల 18న పరిగిలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రత్యేక సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు, ఇ.కృష్ణ, అక్బర్‌ హుస్సేన్‌, సర్వర్‌, రామకృష్ణారెడ్డి, నాగవర్ధన్‌, శ్రీకాంత్‌రెడ్డి, గణేష్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని