పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య
eenadu telugu news
Published : 21/09/2021 13:32 IST

పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌ : పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిని దుండగులు హత్య చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శరీరంపై దుస్తులు లేని స్థితిలో మృతదేహం ఉందని.. కత్తిపోట్లు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని