131 మంది సివిల్స్‌ విజేతలకు మార్గనిర్దేశం
eenadu telugu news
Published : 27/09/2021 03:37 IST

131 మంది సివిల్స్‌ విజేతలకు మార్గనిర్దేశం

రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసెస్‌-2020 ఫలితాల్లో తాను మార్గనిర్దేశం చేసిన అభ్యర్థుల్లో 131 మంది విజయం సాధించినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి 20 ర్యాంకుల్లో ఆరు మంది(ర్యాంకులు 3, 8, 14, 18, 19, 20) ఉన్నట్లుగా వివరించారు. వంద ర్యాంకుల్లో 19 మంది ఉన్నారన్నారు. ఈ విజేతల్లో దిల్లీకి చెందిన సోదరీమణులు అంకితా జైన్‌(3వ ర్యాంక్‌), వైశాలీ జైన్‌(21వ ర్యాంక్‌), ఏపీకి చెందిన ఇద్దరు సోదరులు రాళ్లపల్లి జగత్‌ సాయి(32వ ర్యాంక్‌), రాళ్లపల్లి వసంత్‌కుమార్‌ (170వ ర్యాంక్‌) ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ టాపర్‌ పి.శ్రీజ(20వ ర్యాంక్‌) సలహాలు, సూచనలు తీసుకున్నట్లుగా చెప్పారు. ఏడేళ్లుగా సివిల్స్‌ ముఖాముఖికి హాజరయ్యే ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరఖండ్‌, బిహార్‌, అసోంకు చెందిన వందలాది మంది అభ్యర్థులకు ఇతర ఉన్నతాధికారులతో కలిసి జూమ్‌ వీడియో కాల్‌, వాట్సాప్‌లో మార్గనిర్దేశం చేసినట్లుగా వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని