బీఎస్‌ఎఫ్‌ జవాన్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు


గౌరవ వందనం చేస్తున్న సీఐ సదాశివయ్య, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది

చిలమకూరు (ఎర్రగుంట్ల), న్యూస్‌టుడే: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ నేట్టిమల్లి మహేష్‌ అంత్యక్రియలను ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. చిలమకూరు గ్రామానికి చెందిన మహేష్‌ పంజాబ్‌ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌ ప్రాంతంలో శుక్రవారం 5 కిలోమీటర్ల పరుగు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. శనివారం రాత్రి మహేష్‌ మృతదేహాన్ని చిలమకూరుకు తీసుకురాగా ఆదివారం బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో వందలాది మంది ప్రజల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఎర్రగుంట్ల పట్టణ సీఐ సదాశివయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని