‘వైకాపా పాలనలో మైనార్టీలకు ద్రోహం’
eenadu telugu news
Published : 20/10/2021 04:42 IST

‘వైకాపా పాలనలో మైనార్టీలకు ద్రోహం’


తెదేపా కడప నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు ఇంటి ముందు వైకాపా నాయకుల ఆందోళన

కడప నగరంలో నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నేతలు

అరవిందనగర్‌ (కడప), కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని మైనార్టీలకు ద్రోహం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని తెదేపా కడప నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌ బాబు ఆరోపించారు. కడప నగరంలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీటీసీగా గెలిచిన మైనార్టీ మహిళకు కలెక్టర్‌ కుల ధ్రువీకరణపత్రాన్ని తిరస్కరించడం దుర్మార్గ మన్నారు. మైనార్టీ వర్గానికి రాజ్యాధికారాన్ని దూరం చేయాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రికి ముస్లిం మైనార్టీలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మైనార్టీ మహిళకు అధికారం ఇవ్వకుండా అడ్డు కుంటున్నారని, తక్షణమే మైనార్టీ మంత్రి స్పందించి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ముస్లిం మైనార్టీ ఆడపడచులకు కులధ్రువీకరణ పత్రం ఇవ్వమని అడిగినందుకు ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని, మంగళవారం తన ఇంటిని వైకాపా నాయకులు ముట్టడించడాన్ని ఖండించారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా తెదేపా నేతల ఇళ్లను ముట్టడించడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. తెలుగుదేశం కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైకాపా దాడులకు పాల్పడటం దుర్మార్గమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, హరిప్రసాద్‌ తదితరులు ఖండించారు. అనంతరం వారంతా అమీర్‌బాబుతో కలిసి ఏడురోడ్ల కూడలి నుంచి ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెదేపా నేత అమీర్‌బాబు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు మైనార్టీ ద్రోహులని వ్యాఖ్యానించినందుకు నిరసనగా ఆయన ఇంటిని ముట్టడించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనతోపాటు ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించినందుకు వైకాపా నాయకులు జాషువా, గరుడాద్రి, లక్ష్ముమయ్యతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ. సుధాకర్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని