వైఎస్‌ షర్మిలను కలిసిన నాయకులు
eenadu telugu news
Published : 20/10/2021 05:01 IST

వైఎస్‌ షర్మిలను కలిసిన నాయకులు


షర్మిలతో సెల్ఫీలు దిగుతున్న యువత

వేంపల్లె, న్యూస్‌టుడే: ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ను సందర్శించేందుకు మంగళవారం వచ్చిన ఆయన కుమార్తె, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కడప నగరపాలక సంస్థ ఉప మేయర్‌ నిత్యానందరెడ్డి, వేంపల్లె జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో ప్రజాప్రస్థానం పేరిట చేపడుతున్న పాదయాత్ర విజయవంతమవ్వాలని శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైఎస్‌ఆర్‌ అభిమానులు షర్మిలతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. ఆమెను కలిసిన వారిలో ఏపీఐఐసీ డైరెక్టర్‌ చంద్రఓబుల్‌రెడ్డి, రాష్ట్ర ఖనిజావృద్ధి సంస్థ డైరెక్టర్‌ సల్మా, ఎంపీటీసీసభ్యులు మిట్టా శ్రీనివాసులు, భారతి, మాజీ సర్పంచులు ప్రసాదరెడ్డి, శంకరయ్య, చలపతి, వేంపల్లె ఎంపీటీసీ మాజీ సభ్యుడు కొత్తూరు రెడ్డయ్య, ఇండియన్‌ క్రిష్టియన్‌ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్బీ రవికుమార్‌, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్బీ ప్రవీణ్‌పాల్‌ తదితరులున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని