Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లాలో 282 మందికి కరోనా

పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ద్రావణం పిచికారీ చేస్తున్న దృశ్యం

పెద్దపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కేసుల్లో పట్టణాలతో గ్రామీణ ప్రాంతాలు పోటీ పడుతున్నాయి. పెద్దపల్లి మండలం రాఘవపూర్‌ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఒక్కరోజే 20 మంది వైరస్‌ బారిన పడ్డారు. పెద్దపల్లి మండలంలో 44 మంది, ధర్మారంలో 24 మంది, మంథనిలో 20 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాల్వశ్రీరాంపూర్‌లో 14, జూలపల్లిలో 11, కమాన్‌పూర్‌లో 11, సుల్తానాబాద్‌లో 9, ఓదెలలో 7, ఎలిగేడులో 3, ముత్తారం, రామగిరిలో ఇద్దరు చొప్పున వైరస్‌ బారిన పడ్డారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 282 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 8704కు చేరుకుంది. కాగా పెద్దపల్లిలో వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మునిసిపల్‌ అధికారులు జన సమ్మర్ధం కలిగిన ప్రాంతాల్లో రసాయన మందును పిచికారీ చేశారు. రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌తో పాటు పలు మసీదుల్లో ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు కమిషనర్‌ తిరుపతి తెలిపారు.

రామగుండంలో 135 కేసులు

గోదావరిఖని పట్టణం : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం 135 మందికి కరోనా పాజిటివ్‌ సోకినట్లు నిర్ధారించగా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి కరోనా ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఒకరు మృతి చెందారు. కరోనా పరీక్ష కిట్ల కొరత కారణంగా లక్ష్మీపురం, జనగామ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అతి తక్కువగా పరీక్షలు నిర్వహించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిగా ఉన్న గోదావరిఖని ఫైవింక్లయిన్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి(40) సోమవారం గోదావరిఖని ఆస్పత్రిలో చేరగా మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు. రామగుండంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి, గోదావరిఖనిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు మరో సింగరేణి కార్మికుని కుటుంబంలో ముగ్గురికి మంగళవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. అత్యధికంగా రామగుండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 86 మందికి పరీక్షలు నిర్వహించగా 24 మందికి, గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో 79 మందికి పరీక్షలు నిర్వహించగా 21 మందికి, సింగరేణి ప్రాంతీయ ఆస్పత్రిలో 110 మందికి పరీక్షలు నిర్వహించగా 20 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఆర్జీ-2 ఆస్పత్రిలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో 14 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా పుట్నూరు ఆరోగ్య కేంద్రంలో 102 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కిట్ల కొరత కారణంగా లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో 11 మందికి, జనగామ పట్టణ ఆరోగ్య కేంద్రంలో 17 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని