Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిరుద్యోగ యువతకు ఊరట

280 మందికి రాయితీ రుణాలు మంజూరు

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే

రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్పీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీతో రుణాలను అందిస్తోంది. స్వయం ఉపాధి దిశగా యువతను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా జిల్లాలోని 280 మంది నిరుద్యోగ ఎస్సీ యువతకు 2018-19 ఏడాదికి సంబంధించి ప్రభుత్వం రాయితీ రుణాలను తాజాగా మంజూరు చేసింది.

ప్రభుత్వం రాయితీ రుణాలను మంజూరు చేయడంతో జిల్లాలోని 280 మంది ఎస్సీ నిరుద్యోగ యువత లబ్ధి పొందనున్నారు. రుణాలతో సొంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందే అవకాశం ఏర్పడింది. ఒక్కసారి ఒక కుటుంబం నుంచి ఒకరు రుణం తీసుకుంటే మళ్లీ ఐదు సంవత్సరాల వరకు ఆ అవకాశం ఉండదు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొంత మొత్తాన్ని రాయితీ రుణంగా అందిస్తే, మిగతాది బ్యాంకు అందజేస్తుంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ఒక్కో యూనిట్‌ కింద రూ.50 వేల నుంచి రూ.19 లక్షల వరకు రుణాలు ఇస్తారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకున్న వారికి 80 శాతం రాయితీ ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుంటే 70 శాతం, రూ. 2 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు తీసుకుంటే 60 శాతం గాని, లేదా రూ.5 లక్షలు రాయితీ గాని ఇస్తుంది. మిగతాది బ్యాంకు రుణంగా అందజేస్తుంది. దీనిని మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ఎస్సీ నిరుద్యోగులు 280 మందికి రుణాలు మంజూరయ్యాయి. కేవలం గ్రౌండింగ్‌ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

- అజ్మెరా వినోద్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణాలను జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలి. సొంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం రాయితీతో అందిస్తున్న ఈ రుణాలను యువత సక్రమంగా సద్వినియోగపరుచుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని