ప్రభుత్వమే న్యాయం చేయాలి
logo
Published : 24/06/2021 04:52 IST

ప్రభుత్వమే న్యాయం చేయాలి

విచారణ పేరుతో పోలీసులు తీవ్రంగా హింసించారు: ఉదయ్‌కిరణ్‌


వీపుపై గాయాలు కావడంతో బోర్లా పడుకుని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఉదయ్‌కిరణ్‌

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: పోలీసుల తీరుతో అమ్మను పోగొట్టుకొన్న తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన అంబటిపూడి ఉదయ్‌కిరణ్‌ పాలకులను కోరారు. దొంగతనం కేసులో.. విచారణ పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు తీవ్రంగా హింసించారనీ... ఆ దెబ్బలకు తాళలేక మా అమ్మ మరియమ్మ మృతి చెందిందని వాపోయారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో తీవ్రగాయాలతో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఉదయ్‌కిరణ్‌ బుధవారం ‘న్యూస్‌టుడే’కు జరిగిన సంఘటనను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. గతంలోనే తన తండ్రి చనిపోయాడనీ, నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారని వివరించారు. తామంతా ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయామని వాపోయారు. ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న తనకు ఏ పాపం తెలియదనీ, దొంగతనం చేయలేదని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని చెప్పారు. అక్రమంగా కేసు పెట్టిన చర్చి ఫాదర్‌, పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకొని మా కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని