లేఔట్‌ ఇలా.. నిర్మాణాలెలా..!?
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

లేఔట్‌ ఇలా.. నిర్మాణాలెలా..!?

కాలనీలోని ప్రధాన రహదారి దుస్థితి ఇలా..

న్యూస్‌టుడే, గుడివాడ : గుడివాడ మల్లాయపాలెం కొత్త లేఔట్‌లో పట్టణానికి చెందిన 5,594 మంది పేదలకు ఈ ఏడాది జనవరిలో ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు అందజేశారు. జులై 2, 3, 4 తేదీల్లో తొలి విడతగా ఇందులో 1,260 మంది ఇళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. రహదారి లేక లబ్ధిదారులెవరూ ఇక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంతవరకూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. సగం ప్రాంతంలో కూడా నీటి ట్యాంకులు ఏర్పాటు చేయలేదు. దిమ్మలు కట్టి వదిలేశారు. పైపులు తెచ్చి పడేశారు. ఇద్దరు లబ్ధిదారులు మాత్రం ఇసుక తోలి సరిపెట్టారు. ప్రస్తుతం ఇక్కడ బొమ్ములూరుకు చెందిన పశువుల కాపరులు పచ్చగడ్డి మేపుకుంటున్నారు. ఈ నెల 5న మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, హౌసింగ్‌ డీఈఈ రామోజీనాయక్‌ వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి ఈ లేఔట్‌ను పరిశీలించారు. రహదారి బాగుందని, నిర్మాణాలకు అనువుగా ఉందని, నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. విశేషమేమిటంటే ఈ లేఔట్‌కు వెళ్లే దారి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా అధ్వానంగా ఉంది. ఇప్పటికీ గుంతల్లో నీరు నిలిచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణాలెలా చేపట్టాలో తెలియక లబ్ధిదారులు వాపోతున్నారు. సౌకర్యాలు కల్పిస్తే నిర్మాణాలు ప్రారంభిస్తామని అంటున్నారు.

నిలిచిన నీరు​​​​​​​


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని