Published : 05/12/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాడు-నేడు పనులు వేగవంతం చేయాలి

మాట్లాడుతున్న డీఈవో సాయిరాం

దేవనకొండ, న్యూస్‌టుడే: నాడు-నేడు పనులు, జగనన్న విద్యాకానుక పంపిణీలో బయోమెట్రిక్‌ పెండింగ్‌ పూర్తి చేయాలని డీఈవో సాయిరాం ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో మండల ప్రధానోపాధ్యాయులతో  సమావేశమయ్యారు. డిసెంబర్‌ 10లోపు పెండింగ్‌ పనులు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో విద్యా కానుక పంపిణీలో బయోమెట్రిక్‌ 72 శాతం నమోదైందన్నారు. పాఠశాలలకు సిబ్బంది క్రమం తప్పకుండా వెళ్లి బయోమెట్రిక్‌ వేయాలని డీఈవో ఆదేశించారు. శనివారం నిర్వహించే ఆర్‌జీóŸ΄కేటీ సెట్‌ ప్రవేశ పరీక్షకు 179 మంది విద్యార్థులు దేవనకొండ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రంలో రాయనున్నట్లు ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని