జనాభా ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలి
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

జనాభా ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలి

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌
సమావేశంలో ప్రసంగిస్తున్న నరేందర్‌

మెదక్‌, న్యూస్‌టుడే: జిల్లా జనాభా ప్రాతిపదికన.. ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక టీఎన్జీవో భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును యథావిధిగా అమలు చేయాలని కోరారు. మూలవేతనంలో ఒక్క శాతం చందాతో ఆరోగ్య కార్డులు అందజేసి.. ఉద్యోగులకు నగదు రహిత కార్పోరేట్‌ వైద్యం అందించాలన్నారు. పదోన్నతులకు కనీస అర్హత మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. టీఎన్జీవో మ్యూచువల్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఏర్పాటు చేసి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. చేగుంట, తూప్రాన్‌, ఏడుపాయల, అల్లాదుర్గంలో సంఘ భవనాల నిర్మాణానికి స్థలసేకరణ, యూనిట్ల పరిధిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని ఈ సందర్భంగా తీర్మానించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌, సహాయ అధ్యక్షులు సాదిక్‌ఆలీ, కోశాధికారి రమేశ్‌, ఉపాధ్యక్షురాలు అనురాధ, మనోహర్‌, ఫణిరాజ్‌, ఫజల్‌, ఇక్బాల్‌పాషా, సంయుక్త కార్యదర్శి శంకర్‌, బాధ్యులు బలరాం, చిరంజీవులు, ప్రవళిక, శివాజీ, రామాగౌడ్‌, శేషాచారి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని