రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్రగాయాలు
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్రగాయాలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా మండవెల్లి మండలం బైరా పట్టణానికి చెందిన సాయిబాబా, నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన కె.రమణబాబు లారీలో మెకానిక్‌ షెడ్లలో వినియోగించే వేస్టు తీసుకొని బెంగళూరుకు వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని