Published : 24/02/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జాతీయ పోటీలకు మగ్గిడి విద్యార్థిని


నవీన

మగ్గిడి (ఆర్మూర్‌), న్యూస్‌టుడే: ఆర్మూర్‌ మండలం మగ్గిడి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పి.నవీన జాతీయ స్థాయి సబ్‌జూనియర్‌ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికైందని ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనర్సయ్య, పీఈటీ మధు తెలిపారు. గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆమె రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. 24 నుంచి 28 వరకు తమిళనాడు రాష్ట్రం వేలూర్‌లో జరిగే 43వ జాతీయస్థాయి సబ్‌జూనియర్‌ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. సర్పంచి సుమలత, నర్సయ్య, చంపాబాయి గంగాధర్‌రావు ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు చంద్రవదన్‌రావు, వీడీసీ సభ్యులు, వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్‌గౌడ్‌ క్రీడాకారిణిని అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని