ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై ఫిర్యాదు
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై ఫిర్యాదు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ప్రస్తుతం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వైద్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.రవిచంద్రకు మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్‌ మాదిగ గురువారం ఫిర్యాదు చేశారు. ఎన్‌హెచ్‌ఎం కింద అర్భన్‌, రూరల్‌లో డాక్టర్లు, స్టాఫ్‌నర్సుల నియామకాలకు ఇచ్చిన ప్రకటనలో నిబంధనలు అమలు చేయడం లేదన్నారు. 80 శాతం స్థానిక, 20 శాతం స్థానికేతరులకు కేటాయించాల్సి ఉండగా అమలు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల జిల్లాలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం వాటిల్లుతోందన్నారు. వైద్యశాఖలో జాబితాలు తయారు చేస్తున్న ఉద్యోగిపై గతంలో అవినీతి కేసు ఉన్నందున ఆ బాధ్యత నుంచి తొలగించాలని ఫిర్యాదులో కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని