సమష్టి కృషితోనే లక్ష్యాల సాధన
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

సమష్టి కృషితోనే లక్ష్యాల సాధన

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వి.జ్యోతిర్మయి

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: సమష్టిగా కృషి చేస్తేనే నిర్దేశించిన లక్ష్యాలను సాధించగలమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వి.జ్యోతిర్మయి అన్నారు. ఒంగోలులోని జిల్లా కోర్టు హాల్‌లో ప్యానల్‌ న్యాయవాదులు, పారాలీగల్‌ వాలంటీర్లు, న్యాయ కళాశాల విద్యార్థులు, వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర విభాగాల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రజల ముంగిటకే న్యాయం స్ఫూర్తితో వచ్చేనెల 14వ తేదీ వరకు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు ప్యానల్‌ న్యాయవాదులు, పారాలీగల్‌ వాలంటీర్లతో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలు ఎక్కువగా గుమికూడి ఉండే ప్రదేశాల్లో సదస్సులు నిర్వహించనున్నట్టు చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్‌, సీనియర్‌ న్యాయవాదులు, బొమ్మరిల్లు సంస్థ నిర్వాహకురాలు రాజ్యలక్ష్మి, లయన్స్‌, రోటరీ క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని