మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి


అధికారులతో మాట్లాడుతున్న జీసీసీ ఎండీ శోభ

సీతంపేట, న్యూస్‌టుడే: గిరిజన మహిళలు సంఘాలుగా తయారై వీడీవీకేల ద్వారా ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఎండీ పి.ఎ.శోభ అన్నారు. సీతంపేట మన్యంలో మంగళవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కీసరజోడు గ్రామంలో వన్‌దన్‌ వికాస్‌ కేంద్రం(వీడీవీకే)ను పరిశీలించారు. పసుపు పొడి తయారుచేస్తూ వ్యాపారం చేస్తున్న మహిళలతో మాట్లాడి వారికి వస్తున్న ఆదాయం, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీతంపేట జీసీసీ బ్రాంచి కార్యాలయం పక్కన రూ.40 లక్షలతో నిర్మిస్తున్న దుకాణ సముదాయ భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కొత్తూరులోని జీసీసీ స్థలాన్ని పరిశీలించిన ఎండీ అక్కడ దుకాణ సముదాయం కట్టేందుకు తగిన ప్రతిపాదనలు ఐటీడీఏ పీవో ద్వారా పంపాలని సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో పీవో శ్రీధర్‌తో చర్చించారు. ఆమెతో పాటు జీసీసీ జనరల్‌ మేనేజర్‌(పరిపాలన) చినబాబు, డీఎం ఎస్‌.రామ్మూర్తి, సీతంపేట, పాతపట్నం బ్రాంచ్‌ల మేనేజర్లు జి.నర్సింహులు, కె.శ్రీరాములు, గి.సం.శాఖ ఈఈ జి.మురళి, తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని