రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్‌ సేవలు
eenadu telugu news
Published : 04/08/2021 04:13 IST

రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్‌ సేవలు


జరజాంలో రైతులతో మాట్లాడుతున్న వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: రైతుభరోసా కేంద్రాల్లో నూతనంగా ప్రవేశపెడుతున్న బ్యాంకింగ్‌ సేవలను రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ హనుమంతు అరుణ్‌కుమార్‌ కోరారు. ఎచ్చెర్ల మండలం జరజాం ఆర్బీకేలో బ్యాంకింగ్‌ సేవలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్‌ లావాదేవీలపై బ్యాంకు సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం అన్నదాతలతో మాట్లాడుతూ తక్కువ నీటితో సాగుచేసే పంటల వైపు దృష్టిసారించి అధిక ఆదాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌, ఆత్మ పీడీ కృష్ణారావు, ఎల్‌డీఎం హరిప్రసాద్‌, ఏడీఏ ఆర్‌.రవిప్రకాష్‌, ఏవో బాడాన ఉషారాణి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని