ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తం..
eenadu telugu news
Published : 24/10/2021 06:09 IST

ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తం..

ఆవేదన వ్యక్తం చేస్తున్న దళితులు

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలో ఇళ్ల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నారని ఫిర్యాదు రావడంతో తహసీల్దారు పద్మావతి రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి జేసీబీతో వాటిని తొలగించేందుకు శనివారం వెళ్లారు. దీంతో గ్రామంలోని దళితులు ఎదురు తిరిగారు. గ్రామంలో 21 కుటుంబాల దళితులు ఉన్నారని, వారిలో కొందరు ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుంటే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ అడ్డుకున్నారు. ఇళ్లు కూల్చేందుకు వీలు లేదంటూ జేసీబీ కింద అడ్డుగా పడుకున్నారు. ఒక మహిళ శరీరంపై పెట్రోలు   పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో అధికారులు వెనుదిరిగారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దారు పద్మావతి స్పష్టం చేశారు.

ఆత్మహత్యకు యత్నించిన మహిళ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని