ఆక్సిజన్‌ యూనిట్లను పునరుద్ధరించాలి
eenadu telugu news
Published : 28/10/2021 03:56 IST

ఆక్సిజన్‌ యూనిట్లను పునరుద్ధరించాలి


అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, చిత్రంలో జేసీ శ్రీరాములునాయుడు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ మూడో దశను ఎదుర్కొనేందుకు ఆక్సిజన్‌ యూనిట్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్‌డెస్క్‌ పాలసీ కింద స్వీకరించిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ఇప్పటివరకు 145 ప్రతిపాదనలు అందగా వీటిపై ఆరాతీశారు. ఎంఎస్‌ఈసీడీపీ కార్యక్రమంలో భాగంగా ప్యాకింగ్‌, ప్రింటింగ్‌ పరిశ్రమ క్లస్టర్‌కు గాను శ్రీకాకుళం నగరంలోని మ్యూచువల్‌ క్లస్టర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతిపాదనను సమర్పించామన్నారు. కార్యక్రమంలో జేసీ ఆర్‌.శ్రీరాములునాయుడు, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజరు ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని