Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంత ఆవరణలో వ్యర్థాలు వేస్తే కేసులు

మాంసం దుకాణాలను పరిశీలిస్తున్న సర్పంచి, ఉపసర్పంచి తదితరులు

మాడుగుల, న్యూస్‌టుడే: మాంసం, చేపల దుకాణాల నిర్వాహకులు  సంత ప్రదేశంలో  వ్యర్థాలు పడేస్తే కేసుల నమోదు చేస్తామని సర్పంచి యడ్ల కళావతి, ఉపసర్పంచి శ్రీనాథు శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘సంతలో అసౌకర్యాల చింత’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. ఉదయం ఈ ప్రదేశాన్ని పరిశీలించారు. పంచాయతీ ఎన్నిసార్లు శుభ్రం చేయించినా ప్రతిరోజు ఇష్టారాజ్యంగా వ్యర్థాలు పోయడం సరికాదని దుకాణ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల సంత రోజు చిరు వర్తకులు, కొనుగోలుదారులకు  ఇబ్బందిగా ఉంటోందన్నారు. ఇకపై ఇక్కడ వ్యర్థాలు పోసే వారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి చీపురుపల్లి నాయకుడుకు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని