‘దిశ’ స్టేషన్‌ను సందర్శించిన మహిళా సాధికార కమిటీ
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

‘దిశ’ స్టేషన్‌ను సందర్శించిన మహిళా సాధికార కమిటీ

సీపీ సిన్హా, పోలీసు సిబ్బందితో పార్లమెంటరీ మహిళా సాధికార కమిటీ సభ్యులు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : పార్లమెంటరీ మహిళా సాధికార కమిటీ సభ్యులు ఎండాడలోని దిశా పోలీసుస్టేషన్‌ను శనివారం ఉదయం సందర్శించారు. నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, దిశా డి.ఐ.జి. రాజకుమారి, ఏడీసీపీ(పరిపాలన) రజని, ఏసీపీ ప్రేమ్‌కాజల్‌లు పాల్గొన్నారు. దిశా పోలీసుస్టేషన్‌కు వస్తున్న కేసులు, ఛార్జీషీటు దాఖలు విధానంపై సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా కమిటీ సభ్యులకు వివరించారు. పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా దిశా పెట్రోలింగ్‌ వాహనాల పనితీరు, మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన కొంతమంది బాధితులతో కమిటీ సభ్యులు మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. దిశా వాహనాల గురించి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. దిశా సిబ్బంది పనితీరును అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని