ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
eenadu telugu news
Published : 26/09/2021 03:40 IST

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఎంవీపీ స్టేషన్‌ పోలీసులు తెలిపిన ఇలా ఉన్నాయి. కె.ఆర్‌.ఎం.కాలనీకి చెందిన పవన్‌కుమార్‌ (22) ఓ ప్రైవేటు సంస్థలో డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల వివాహానికి సంబంధించిన చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో మద్యం మానేయమని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి చిట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సి.ఐ పి.రమణయ్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని