బాణసంచా పేలుళ్ల ఘటనలో ఇద్దరి అరెస్టు
eenadu telugu news
Published : 27/10/2021 02:17 IST

బాణసంచా పేలుళ్ల ఘటనలో ఇద్దరి అరెస్టు

రావికమతం, న్యూస్‌టుడే: మేడివాడలో బాణసంచా పేలుళ్ల ఘటనలో ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై జోగారావు చెప్పారు. బాణసంచా వ్యాపారి కొనగళ్ల సాంబశివ ఇంట్లో ఆదివారం రాత్రి విస్పోటనం జరిగి భవనం కూలిపోగా, అతడి తల్లి నూకరత్నం సజీవ దహనమైన సంగతి తెలిసిందే. బ్లాస్టింగ్‌కు ఉపయోగించే గంధకం, స్పెన్సిల్‌, ఎలక్ట్రిక్‌ పౌడర్‌, పటాస్‌ వంటివి నిల్వ చేయడం, వాటితో చిచ్చుబుడ్లు, టపాసులు తయారు చేయడమే పేలుళ్లకు ప్రధాన కారణంగా గుర్తించి వ్యాపారి కొనగళ్ల సాంబశివపై ఎక్స్‌ప్లోజివ్‌ యాక్ట్‌, హత్యానేరంతో సహా ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇతనికి సామగ్రిని విక్రయించిన చోడవరానికి చెందిన పూసర్ల వెంకట్రావును అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు.
గంజాయితో పదకొండు మంది..
నర్సీపట్నం అర్బన్‌, చోడవరం పట్టణం, గూడెంకొత్తవీధి: జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం గంజాయి రవాణా చేస్తూ పదకొండు మంది పట్టుబడ్డారు. ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతం నుంచి వాహనంలో 136 కేజీల గంజాయి తీసుకువస్తున్న ముగ్గురిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో నర్సీపట్నం డివిజినల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం  తురబాల గెడ్డ వద్ద పట్టుకుంది. ఏఈఎస్‌ బీవీజీ రాజు, ఇన్‌స్పెక్టర్‌ చలపతిరావు, ఎస్సై రాజ్‌కుమార్‌, శిక్షణ ఎస్సైలు రాజేష్‌, నర్సింహమూర్తి వాహన తనిఖీల్లో పాల్గొన్నారు.
* మాడుగుల ఘాట్‌రోడ్డు కూడలిలో  46 కేజీల గంజాయితో ఆరుగురు పట్టుబడ్డారని చోడవరం సీఐ ఇలియాస్‌ మహమ్మద్‌ పేర్కొన్నారు. కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారులో నలుగురు గంజాయితో పట్టుబడగా, డుంబ్రిగుడ మండలం గసబ పంచాయతీకి చెందిన పాలకి పవన్‌కుమార్‌, కిల్లో పాపారావు కారుకు ఎస్కార్ట్‌గా వస్తూ దొరికారన్నారు.
* దారకొండ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్న కర్ణాటకకు చెందిన ఇద్దరి అరెస్టు చేసినట్లు   గూడెంకొత్తవీధి సీఐ అశోక్‌కుమార్‌, ఎస్సై సమీర్‌ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని