ఆక్వా అభివృద్ధికి పూర్తి సహకారం
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

ఆక్వా అభివృద్ధికి పూర్తి సహకారం


ప్రసంగిస్తున్న నిర్మలకుమారి

విజయనగరం కోట, న్యూస్‌టుడే: జిల్లాలో ఆక్వారంగం అభివృద్ధికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ సహకారం ఉంటుందని మత్స్యశాఖ ఉపసంచాలకురాలు నిర్మలకుమారి అన్నారు. విజయనగరంలో ఆక్వా కల్చర్‌పై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఆర్బీకేల ద్వారా చేపలు, రొయ్యల మేత సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎస్‌ఏడీఏ చట్టం ప్రకారం ఆక్వాసాగుకు సులభతర అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పీనీయస్‌ మొనోడాన్‌ రొయ్యపిల్లల ఉత్పత్తి, సరఫరా, నియంత్రణ, ధరలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి సచివాలయంలో చేపల విక్రయ యూనిట్లు ఏర్పాటు చేసి వినియోగదారుల వద్దకే నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను చేరవేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని