పెండింగు కేసుల పరిశీలన
eenadu telugu news
Published : 24/10/2021 06:05 IST

పెండింగు కేసుల పరిశీలన


జిల్లా జడ్జి రవీంద్రబాబుతో సమావేశమైన కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరులీగల్‌, న్యూస్‌టుడే: జిల్లా న్యాయ సమన్వయ కమిటీ సమావేశం శనివారం ఉదయం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు అధ్యక్షతన ఆయన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, గ్రామీణ జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ, అర్బన్‌ ఏఎస్పీ గంగాధరం, జిల్లా జైలు సూపరింటెండెంట్‌ హంసపాల్‌, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నకుమార్‌, ప్రభుత్వ న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విచారణ ఖైదీలకు సంబంధించిన కేసులను జిల్లా వ్యాప్తంగా పరిశీలించారు. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, బెయిల్‌ పొంది జైలు నుంచి విడుదల కాలేని ఖైదీలు, మరికొన్ని స్వల్ప నేరాల కేసులను కూడా పరిశీలించారు. ఆ ఖైదీల విడుదలకు, విచారణలకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజలకు సత్వర సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందనీ, ఉద్యోగులు ప్రజల ఆకాంక్షల మేరకు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టరు వివేక్‌ యాదవ్‌ అన్నారు. శనివారం నగరంలోని ఎన్జీవో కాలనీ 90వ వార్డు సచివాలయాన్ని కలెక్టరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వీసు రికార్డులు పరిశీలించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వివరాలను నమోదు చేసి త్వరితగతిన నివేదికను సంబంధిత అధికారులకు పంపాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నగరపాలకసంస్థ అదనపు కమిషనరు శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ మండల తహసీల్దారు వెంకటేశ్వర్లు, జిల్లా ఇ-సర్వీసెస్‌ మేనేజరు రత్నం తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని