KTR: విజయగర్జనకు పార్టీ శ్రేణులు కదలిరావాలి: కేటీఆర్‌
eenadu telugu news
Published : 18/10/2021 14:12 IST

KTR: విజయగర్జనకు పార్టీ శ్రేణులు కదలిరావాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ‘తెలంగాణ విజయగర్జన’ పేరుతో తెరాస నవంబర్‌ 15న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం మేరకు తెలంగాణ భవన్‌లో ఆయన ముఖ్య నేతలతో సభ సన్నాహాలపై చర్చించారు. ఈ ఉదయం నుంచి నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

సభ విజయవంతానికి పార్టీ శ్రేణులన్నీ కదలాలని కేటీఆర్‌ వారిని కోరారు. పది లక్షల మందితో సభ నిర్వహించేందుకు అన్ని నియోజకవర్గాల్లో నేతలు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. స్థానికంగా సమన్వయ లోపాలు ఉంటే వాటిని పక్కన పెట్టి పనిచేయాలని స్పష్టం చేశారు. మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు నియోజకవర్గ నేతలతో కేటీఆర్ ఇప్పటికే చర్చించారు. ఇవాళ్టి నుంచి రోజూ 20 నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని