close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

విమానాశ్రయంలో కర్ణాటకవాసి దుర్మరణం

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: వాహనానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో తలపై రాడ్డు పడి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆర్జీఐఏ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన ఖాజామోహినుద్దీన్‌(26) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ట్రక్కు మెకానిక్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం విస్తరణ పనుల్లో భవన నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న ఓ టిప్పర్‌ మరమ్మతులకు గురైంది. ఆ టిప్పర్‌కు మరమ్మతులు చేస్తున్న కార్మికుడిపై ఓ ఇనుప రాడ్డు పడింది. తీవ్రంగా గాయపడిన కార్మికుడిని వెంటనే ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.