close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

ప్రధానాంశాలు

చూద్దాం.. నేర్చుకుందాం

పైలట్‌ ప్రాజెక్టుగా అమలు

వీడియోలతో అదనపు సమాచారం

అభ్యసన ప్రక్రియలు మరింత పటిష్ఠం

● నేడు ఉపాధ్యాయులకు నిపుణ ఛానల్‌ ద్వారా అవగాహన

న్యూస్‌టుడే, కోస్గి


అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు

పాఠశాల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యాశాఖ వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టింది. బోధన ప్రక్రియలు ఆసక్తికరంగా ఉండేందుకు ఈ ఏడాది పాఠ్యపుస్తకాల రూపకల్పనలో మార్పుచేసింది. పాఠ్యాంశాలకు చెందిన భావనలు, నిర్ధిష్టంగా, ప్రభావవంతంగా అర్థం చేసుకోవడానికి దోహదపడేందుకు వీలుగా ఈ ఏడాది ఎనిమిదో తరగతి జీవశాస్త్రం, భౌతికశాస్త్రం పుస్తకాలను పైలట్‌ ప్రాజెక్టు అమలులో భాగంగా వినూత్నంగా తీర్చిదిద్దింది. దీక్ష, ఎంహెచ్‌ఆర్‌డీ సహకారంతో ఈ ప్రాయోగిక పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ నెల 20న టీసాట్‌ నిపుణ ఛానల్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించనున్నారు. విద్యార్థి విని నేర్చుకోవడం కన్నా, ప్రయోగాల ద్వారా వీక్షిస్తూ నేర్చుకోవడంతో ఆయా పాఠ్యాంశాలు చిరస్థాయిగా మదిలో నిలిచిపోయే అవకాశం ఉందని విషయనిపుణులు భావిస్తున్నారు. గతంలో విందాం.. నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా రేడియో పాఠాలు వినిపించేవారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచేందుకుగాను క్యూఆర్‌ కోడ్‌ విధానం అమలులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్‌లు ఈ బోధనకు వెసులుబాటు కల్పిస్తున్నాయి.

ఆసక్తికర వీడియోలు..

పాఠ్యాంశాలలోని ఆయా విషయాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం మరింత విస్తృత పరచుకోవడానికి ఆసక్తికర వీడియోలు, యానిమేషన్స్‌, స్లైడులు, డ్యాక్యుమెంటరీలు పొందుపరచడంతో పుస్తకంలోని సమాచారానికితోడు అదనపు సమాచారం అందుబాటులో ఉంచారు. దీంతో విద్యార్థులు భావనలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, ఉపాధ్యాయులు తాము నిర్వహించే బోధన కృత్యాలు అర్థవంతంగా కొనసాగడానికి తోడ్పడడనున్నాయి.

క్యూఆర్‌ కోడ్‌లను ఎలా ఉపయోగించాలి.

స్మార్ట్‌ఫోన్‌లోని ప్లేస్టోర్‌ ద్వారా దీక్ష యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను క్లిక్‌ చేసిన తర్వాత పాఠ్యపుస్తకంలో ముద్రించబడిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. దీంతో కోడ్‌కు జత చేయబడిన సంబంధిత అంశాలు కనిపిస్తాయి. కావలసిన విషయాలను వీక్షించడం కోసం లింక్‌పై క్లిక్‌ చేయాలి. కంప్యూటర్‌, ప్రొజెక్టర్‌, కేయాన్‌ల ద్వారా వీక్షించే వీలుకూడా ఉంది.


పాఠ్యాంశంలోని క్యూ ఆర్‌ కోడ్‌లు

క్యూఆర్‌ కోడ్‌లతో బలోపేతం..

పాఠ్యాంశాలలోని అంశాలను ఉపాధ్యాయులు సమర్థంగా బోధించడంతో పాటు విద్యార్థులు ఆసక్తికరంగా నేర్చుకోవడానికి ఆయా పాఠ్యాంశాల కృత్యాల దగ్గర క్యూఆర్‌ కోడ్‌లను ముద్రించింది. ఈ కోడ్‌లలో చేర్చిన అంశాలను స్మార్ట్‌ ఫోన్‌లలోగాని, ఎల్‌సీడీ ప్రొజెక్టర్‌, కేయాన్‌ ప్రొజెక్టర్ల ద్వారా కాని తెరలపై చూడవచ్ఛు

సాధన చేస్తున్న విద్యార్థులు

పుస్తకాల్లో ఇలా..

ప్రస్తుతం జీవశాస్త్రంలోని సూక్ష్మజీవుల ప్రపంచం, జీవవైవిధ్యం, ఆవరణవ్యవస్థలు, వాతావరణ కాలుష్యం, భౌతిక శాస్త్రంలోని కాంతిపరావర్తనం, విద్యుత్తు వాహకత, సౌర కుటుంబం, చలనరేఖలు పాఠ్యాంశాలకు చెందిన క్యూ ఆర్‌ కోడ్‌లలోని మరిన్ని విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిని కోస్గిలోని జడ్పీ బాలుర, ముశ్రీఫా జడ్పీ ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల స్మార్ట్‌ఫోన్‌ల సాయంతో ఇంటి దగ్గర వీక్షించడంతో పునఃశ్చరణకు వీలు కలుగుతోంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.