close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

దద్దరిల్లిన బస్‌భవన్‌.. అరెస్టులతో ఉద్రికత్త

ముషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పలు సంఘాల నేతలు మంగళవారం చేపట్టిన నిరసనలతో బస్‌ భవన్‌ దద్దరిల్లింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివిధ పార్టీలు, ప్రజా, యువజన సంఘాలు వేర్వేరుగా బస్‌భవన్‌ ముట్టడికి యత్నించారు. అరెస్టులు, తోపులాటలతో బస్‌భవన్‌, వీఎస్టీ చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, వివిధ మహిళా సంఘాలు, తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో వీఎస్టీ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. సీపీఐ(ఎంల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.రంగారావు, ఆయా సంఘాల నేతలు రమ, ఝాన్సీ, సూర్యం, అరుణ, ముషీరాబాద్‌ డిపో-1, 2ల మహిళా సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసి పలు ఠాణాలకు తరలించారు. డీవైఎఫ్‌ఐ, పీవైఎల్‌, ఏఐడీవైఓ, ఏఐఎఫ్‌డీవై, అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్‌) సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా బస్‌భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి నారాయణగూడ స్టేషన్‌కు తరలించారు.

సమ్మెకు మద్దతుగా సంతకాల సేకరణ
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ నవ నిర్మాణ్‌ విద్యార్థి సేన ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో సంతకాల సేకరణ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథుగా హాజరైన కపిలవాయి దిలీప్‌కుమార్‌, టీఎన్‌వీఎస్‌ అధ్యక్షుడు టి.కె.శివప్రసాద్‌ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని విడనాడి కార్మికులతో చర్చలు జరపాలని సూచించారు.

మంత్రి ఇంటి ముట్టడికి వెళ్లిన విద్యార్థులు... ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రవాణామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇంటిని ముట్టడించేందుకు ఓయూ ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. వారిని ఓయూ పోలీసులు అదుపులో తీసుకున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.