close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

గవర్నర్‌ పర్యటన నేడు

నన్నయ విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజానగరం మండలంలోని గైట్‌ కళాశాలకు గురువారం రానున్నారని చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్‌ కేవీవీ సత్యనారాయణ రాజు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు ఆయన చేరుకుంటారన్నారు. అనంతరం కళాశాలలో జగద్గురు శంకరాచార్య పూరి గోవర్థన పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మహరాజ్‌తో నిర్వహించనున్న ధర్మ చైతన్య సభను ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు జిల్లాలోని పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు హాజరవుతారన్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి ధర్మచైతన్య సభ ప్రారంభమవుతుందన్నారు. పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మహరాజ్‌ భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణ చేస్తారన్నారు.

మోహరించిన బలగాలు

గవర్నర్‌ పర్యటనకు సంబంధించి రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం హెలీప్యాడ్‌, సభావేదిక, కళాశాల ప్రాంగణాలను ఏఎస్పీ లతామాధురి పరిశీలించారు. సాయంత్రం బందోబస్తు నిర్వహించనున్న పోలీసులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏర్పాట్లపై గైట్‌ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌ వివరాలు వెల్లడించారు. 518 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారన్నారు. గవర్నర్‌ కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌, గౌరవ వందనం సమర్పించేందుకు కసరత్తు చేశారు.

గవర్నర్‌ పర్యటన బందోబస్తుపై సమీక్ష నిర్వహిస్తున్న అదనపు ఎస్పీ లతామాధురి

పర్యటన సాగేదిలా..

కాకినాడ కలెక్టరేట్‌: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.15 గంటలకు రాజ్‌భవన్‌ వద్ద బయలుదేరి 9.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.50 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో బయలుదేరి 10.30 గంటలకు రాజానగరం మండలంలోని గైట్‌ కళాశాలకు చేరుకుంటారు. 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.45 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.