శనివారం, డిసెంబర్ 07, 2019
కరపలోని చౌక దుకాణాన్ని తనిఖీ చేస్తున్న డీఎస్వో
కరప, న్యూస్‌టుడే: పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి నెలా నిత్యావసర సరకులు అందిస్తోందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఎఫ్ఎస్ఏ(నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు) రేషన్ కార్డులు ఉన్నవారు ఏ చౌక దుకాణం వద్ద నుంచైనా సరుకులు పొందవచ్చని జిల్లా పౌర సరఫరాల అధికారి పి.ప్రసాదరావు పేర్కొన్నారు. కరపలోని నక్కావారిపేట చౌక దుకాణాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఎస్ఏ గోడ ప్రతులను దుకాణాల వద్ద ఉంచారో లేదో పరిశీలించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర పోర్టబిలిటీలో భాగంగా నిత్యావసర వస్తువులను ఎక్కడి నుంచైనా తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి నెలా 15వ తేదీ లోపు సరకులను తీసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్వో పీతల సురేష్, ఎంఎస్‌వోలు పి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వార్తలు