close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

సామాజిక భవనాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం!

యంత్రాంగానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌:  నగరంలో వివిధ ప్రాంతాల వద్ద రాత్రిళ్లు రక్షణ లేకుండా నిద్రిస్తోన్న వ్యక్తులను నిరాశ్రయుల కేంద్రాలకు తరలించాలని బుధవారం జెడ్సీలు, డీసీలతో బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన నగరవ్యాప్తంగా ఉన్న 15 నిరాశ్రయుల కేంద్రాల్లో వసతులను చక్కదిద్దాలన్నారు. వసతులు సరిపోకపోతే చుట్టుపక్కలున్న సామాజిక భవనాలను వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం కేంద్రాల్లో సుమారు 600ల మంది ఉంటున్నారన్నారు. అయినప్పటికీ కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో నిద్రించే వారు ఎక్కువగా కనిపిస్తున్నారన్నారు. నగరవ్యాప్తంగా జరుగుతోన్న భవన నిర్మాణ వ్యర్థాల సేకరణకు ఉపకమిషనర్లు సహకరించాలని, వ్యర్థాల నిల్వకు ఖాళీ స్థలాలను గుర్తించి ఇవ్వాలన్నారు. దోమల నివారణ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 2021 జనాభా లెక్కల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో..వీధి వ్యాపారుల విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.